కరీంనగర్, హనుమకొండ జిల్లాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి నేటి నుంచే అమల్లో ఉంటుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ తెలిపారు. ఈవీఎంల మొదటి దశ తనిఖీ పూర్తయిందని వెల్లడించారు. 305 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని... అదనపు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.
Huzurabad Bypoll 2021: అమల్లోకి ఎన్నికల నియమావళి.. ఆ పథకాలకు ఇబ్బంది లేదు: శశాంక్ గోయల్ - తెలంగాణలో ఎన్నికలు
13:16 September 28
కరీంనగర్, హనుమకొండ జిల్లాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి
''నిన్నటి వరకు 2,36,269 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్ఆర్ఐ, సర్వీస్ ఓటర్లు కలిపితే ఓట్లర సంఖ్య 2,36,430 మంది ఉన్నారు. 18-19 ఏళ్ల మధ్య 4,988 మంది ఓటర్లు... 80 ఏళ్లపైన 4,454 మంది ఓటర్లు ఉన్నారు. 80 ఏళ్ల పైబడినవారికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తున్నాం. దివ్యాంగులు, కొవిడ్ రోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఏర్పాటు చేశాం. ఇప్పటికే అమల్లో ఉన్న పథకాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎవరైనా ఫిర్యాదులు చేస్తే ఈసీ దృష్టికి తీసుకెళ్తాం. 610 వీవీప్యాట్‌లను తనిఖీ చేశాం. నామినేషన్ల తర్వాత ఈవీఎంలపై నిర్ణయం తీసుకుంటాం. ఎక్కువ ఈవీఎంలు అవసరమైతే తగిన చర్యలు తీసుకుంటాం. అభ్యర్థులు, ఏజెంట్లు, డ్రైవర్లు, కార్యకర్తలు 2 డోసుల టీకా తీసుకోవాల్సిందే. 2 డోసుల టీకా తీసుకున్న వారికే ఎన్నికల విధుల్లో పాల్గొనాలి.''
-శశాంక్ గోయల్, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి
కొవిడ్ నిబంధనలు పూర్తిస్థాయిలో పాటించాలని శశాంక్ గోయల్ సూచించారు. నామినేషన్ ముందు, తర్వాత ర్యాలీలు చేయొద్దని స్పష్టం చేశారు. రోడ్‌షోలకు అనుమతి లేదన్నారు. ఈసీ నిబంధనలకు లోబడే ప్రచారం చేయాలని... పోలింగ్‌కు 72 గంటల ముందే ప్రచారాన్ని ముగించాలని శశాంక్ గోయల్ వెల్లడించారు. గుర్తింపు పార్టీలకు 20 మంది స్టార్ క్యాంపెయినర్లకు అనుమతిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎవరైనా ఉల్లంఘనలకు పాల్పడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.