కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని మైలారం గ్రామంలో రేణుక ఎల్లమ్మ ఆలయ నిర్మాణం జరుగుతోంది. కమిటీ సభ్యులు, గ్రామస్థులు అధిక సంఖ్యలో తరలివచ్చి పనులను పర్యవేక్షిస్తున్నారు. ఎల్లమ్మ విగ్రహంతో పాటు విగ్రహాలు కొలువుదీరాయి. ఈ క్రమంలో ఉదయం ఆలయంలోకి ప్రవేశించిన నాగుపాము సాయంత్రానికి అయినా బయటకి వెళ్లకపోవడంతో స్థానికులు అధిక సంఖ్యలో తరలివచ్చి పామును తిలకించారు.
రేణుక ఎల్లమ్మ ఆలయంలో దూరిన నాగుపాము - కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని మైలారం గ్రామంలోరేణుక ఎల్లమ ఆలయంలో దూరిన నాగుపాము
నూతనంగా నిర్మిస్తున్న రేణుక ఎల్లమ్మ ఆలయంలో నాగుపాము ప్రవేశించి స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలోని మైలారం గ్రామంలో చోటుచేసుకుంది.

రేణుక ఎల్లమ్మ ఆలయంలో దూరిన నాగుపాము