తెలంగాణ

telangana

ETV Bharat / state

గతంలో నన్ను బాధ పెట్టారు - ఈసారి అలా జరగొద్దు : సీఎం కేసీఆర్ - తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023

CM KCR Participates in Praja Ashirvada Sabha at Huzurabad : దేశ ప్రజాస్వామ్యంలో రావాల్సినంత పరిణతి ఇంకా రాలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా.. సమస్యలు పరిష్కారం కాలేదని తెలిపారు. పోటీ చేస్తున్న అభ్యర్థి గుణగణాలతో పాటు వారి పార్టీ చరిత్ర కూడా చూడాలని ప్రజలకు సూచించారు. ప్రజల గురించి ఏ పార్టీ ఎలా ఆలోచిస్తుందో గమనించి ఓటు వేయాలని కోరారు. గతంలో తనను బాధ పెట్టారని.. ఈసారి అలా జరగొద్దని కేసీఆర్ పేర్కొన్నారు.

Praja Ashirvada Sabha at Huzurabad
CM KCR

By ETV Bharat Telangana Team

Published : Nov 17, 2023, 5:22 PM IST

Updated : Nov 17, 2023, 6:55 PM IST

గతంలో నన్ను బాధ పెట్టారు - ఈసారి అలా జరగొద్దు : సీఎం కేసీఆర్

CM KCR Participates in Praja Ashirvada Sabha at Huzurabad :గతంలో తనను బాధ పెట్టారని.. ఈసారి అలా జరగొద్దని బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. పాలిచ్చే బర్రెను వదిలి పెట్టి ఎవరైనా దున్నపోతును తెచ్చుకుంటారా అని ప్రజలను ప్రశ్నించారు. కరీంనగర్​ జిల్లా హుజూరాబాద్​లోని ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

CM KCR Election Campaign in Huzurabad : ఎన్నికలొచ్చాయంటే అడ్డగోలు జమాబందీలు జరుగుతుంటాయని కేసీఆర్ హెచ్చరించారు. ఇళ్లకు వెళ్లిన తర్వాత రాయి ఏదో.. రత్నం ఏదో ఆలోచించుకోవాలని సూచించారు. అక్కడ నిలబడింది ఎవరు.. గుణ గణాలు, పార్టీల చరిత్ర, నడవడి ఏంటో బేరీజు వేసుకోవాలని కోరారు. అడ్డగోలుగా ఓటు వేయవద్దని సూచించారు.

బీఅర్​ఎస్ పుట్టిందే తెలంగాణ రాష్ట్రం కోసమని.. కాంగ్రెస్, బీజేపీల చరిత్ర గురించి కూడా ప్రజలు తెలుసుకోవాలని తెలిపారు. మంచి పార్టీకి ఓటు వేస్తే అంతా మంచే జరుగుతుందని పేర్కొన్నారు. తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ అని.. ఇది ఉద్యమాల గడ్డ అని తాను కూడా ఇక్కడికి ఎన్నోసార్లు వచ్చానని వివరించారు. బీజేపీ చరిత్ర పదేళ్లు అయిందన్న సీఎం కేసీఆర్.. దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు ఇచ్చినా తెలంగాణకు ఒక్క కాలేజీ కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ఒక్క మెడికల్ కాలేజీ, నవోదయ పాఠశాల ఇవ్వని బీజేపీకి ఎందుకు ఓటేయ్యాలో ప్రజలే ఆలోచించుకోవాలని సూచించారు.

బీజేపీకి మత పిచ్చి తప్ప ఏం తెలీదు - ప్రజలు అభ్యర్థుల గుణగణాలు విచారించి ఓటు వేయాలి : సీఎం కేసీఆర్

Telangana Assembly Elections 2023 :మోటార్లకు మీటర్లు పెట్టకపోతే నిధుల్లో కోత పెడతానన్నా తాను పట్టించుకోలేదని సీఎం చెప్పారు. రైతుబంధు 16 వేలు కావాలంటే ఇక్కడ కౌశిక్ రెడ్డి గెలవాలని.. అయన గెలిస్తేనే అక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ,భట్టి విక్రమార్క ,రేవంత్​రెడ్డిలు ధరణి బంగాళాఖాతంలో వేసి.. భూమాత పెడతారనంటున్నారని ఆరోపించారు. ధరణి పొతే మరి రైతుబంధు ఎలా వస్తుందో ఒక్కసారి ఆలోచించుకోమని ప్రజలను ప్రశ్నించారు. పేదల గురించి ఆలోచించే ఏకైక పార్టీ బీఆర్​ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు.

CM KCR Comments on Etela Rajendar : హుజూరాబాద్​లో బీజేపీ గెలిస్తే ఏమొస్తదని.. ఇప్పుడు ఇక్కడ గెలిచినా ఈటల రాజేందర్​ ఇన్నాళ్లనుంచి ఒక్కపైసా పని చేసిండా అని సీఎం కేసీఆర్ ప్రజలను అడిగారు. అక్కడ బీఅర్​ఎస్ ప్రభుత్వం వచ్చి.. ఇక్కడ హుజూరాబాద్​ నియోజకవర్గంలో కౌశిక్ రెడ్డి గెలవకపొతే ఏం లాభంలేదని తెలిపారు. కౌశిక్ రెడ్డి తన కుమారుడు లాంటి వాడని.. తనతోనే హైదరాబాద్​లో ఉంటారని పేర్కొన్నారు. ఈటల రాజేందర్​లేని రోజుల్లోనే కౌశిక్ రెడ్డి తండ్రి గులాబీ జెండామోశారని గుర్తుచేశారు.

BRS Election Campaign in Huzurabad :దేశ ప్రజాస్వామ్యంలో రావాల్సినంత పరిణతి ఇంకా రాలేదని సీఎం కేసీఆర్ ఆరోపించారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచినా.. సమస్యలు పరిష్కారం కాలేదని తెలిపారు. పోటీ చేస్తున్న అభ్యర్థి గుణగణాలతో పాటు వారి పార్టీ చరిత్ర కూడా చూడాలని హుజూరాబాద్ ప్రజలకు సూచించారు. ప్రజల గురించి ఏ పార్టీ ఎలా ఆలోచిస్తుందో గమనించి ఓటు వేయాలని కోరారు. ఉన్న తెలంగాణను ఒకప్పుడు ఊడగొట్టిందే కాంగ్రెస్‌ పార్టీ అని ధ్వజమెత్తారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్‌ ఎంతో మోసం చేసిందని సీఎం కేసీఆర్ ఆరోపించారు.

ఈసారి ప్రజలు మోసపోతే - పదేళ్ల కష్టం బూడిదలో పోసిన పన్నీరవుతుంది : సీఎం కేసీఆర్

2024 తర్వాత కేంద్రంలో బీఆర్‌ఎస్‌ కీలకం కానుంది : కేసీఆర్‌

Last Updated : Nov 17, 2023, 6:55 PM IST

ABOUT THE AUTHOR

...view details