హుజూరాబాద్ తెరాస అభ్యర్థిని సీఎం కేసీఆర్ ప్రకటించారు. హుజూరాబాద్ తెరాస అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును ఖరారు చేశారు. మాజీ మంత్రి ఈటల రాజీనామాతో హుజూరాబాద్ ఉపఎన్నిక అనివార్యమైంది. నియోజకవర్గంలోని సామాజిక సమీకరణాలను పరిశీలించిన తర్వాత తెరాస విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న గెల్లు శ్రీనివాస్ వైపే కేసీఆర్ మెుగ్గు చూపినట్లు తెలుస్తోంది.
Huzurabad: హుజూరాబాద్ తెరాస అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్.... ఖరారు చేసిన కేసీఆర్ - హుజూరాబాద్ తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరు ఖరారు
హుజూరాబాద్ ఉప ఎన్నిక తెరాస అభ్యర్థిని ప్రకటించారు. తెరాస విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును సీఎం కేసీఆర్ ఖరారు చేశారు.
Huzurabad: హుజూరాబాద్ తెరాస అభ్యర్థి దాదాపు ఖరారు.. ఆయన ఎవరంటే?
వీణవంక మండలం హిమ్మత్నగర్కు చెందిన గెల్లు శ్రీనివాస్... మలి దశ ఉద్యమంలో పాల్గొన్నారు. విద్యార్థి నేతగా చురుగ్గా ఉన్న గెల్లు శ్రీనివాస్ 2017 నుంచి తెరాస విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
ఇదీ చూడండి: Huzurabad: ఎవరైతే బాగుంటుంది... హుజూరాబాద్ ఉపఎన్నికపై తెరాస కసరత్తు
Last Updated : Aug 11, 2021, 12:07 PM IST