తెలంగాణ

telangana

ETV Bharat / state

మంత్రి గంగుల తండ్రి దశదినకర్మకు హాజరైన సీఎం.. పూలమాల వేసి నివాళులు - cm kcr latest news

ఇటీవల మృతి చెందిన మంత్రి గంగుల కమలాకర్‌ తండ్రి గంగుల మల్లయ్య దశదినకర్మకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో కరీంనగర్‌ చేరుకున్న సీఎం.. ముందుగా మంత్రిని పరామర్శించారు. అనంతరం ఆయన తండ్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

CM KCR
CM KCR

By

Published : Jan 16, 2023, 3:22 PM IST

కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని కొండసత్యలక్ష్మి గార్డెన్‌లో మంత్రి గంగుల కమలాకర్ తండ్రి దశదినకర్మకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరై నివాళులు అర్పించారు. హైద‌రాబాద్ నుంచి హెలికాప్టర్‌లో కరీంనగర్ స్పోర్ట్స్‌ స్కూల్‌కు చేరుకున్న సీఎం.. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో కేఎస్‌ఎల్‌ గార్డెన్‌కు చేరుకున్నారు. అక్కడ మంత్రి గంగుల తండ్రి గంగుల మల్లయ్య దశదినకర్మలో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘ‌న నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మల్లయ్య కుమారులైన మంత్రి గంగుల కమలాకర్, ఆయన సోదరులు గంగుల వెంకన్న, సుధాకర్‌లతో పాటు కుటుంబసభ్యులను కేసీఆర్ పరామర్శించారు. సీఎం వెంట ఎంపీ సంతోశ్‌కుమార్, మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, రసమయి బాలకిషన్, మేయర్ సునీల్‌రావు తదితరులు ఉన్నారు. పెద్దకర్మ అనంతరం ముఖ్యమంత్రి అక్కడి నుంచి స్పోర్ట్స్‌ స్కూల్‌కు చేరుకుని.. హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు తిరుగుపయనమయ్యారు.

అప్పుడు ఫోన్‌లో పరామర్శించిన సీఎం: ఈ నెల 4న మంత్రి గంగుల కమలాకర్‌ తండ్రి గంగుల మల్లయ్య కన్నుమూశారు. కరీంనగర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. మంత్రి తండ్రి మరణించిన విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. అదే రోజు మంత్రి గంగులకు ఫోన్ చేసి పరామర్శించారు. నాన్నను కోల్పోయిన బాధలో ఉన్న గంగులను ఓదార్చి.. వారి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. భగవంతుడు గంగుల మల్లయ్య ఆత్మకు శాంతిని చేకూర్చాలని సీఎం కేసీఆర్ ప్రార్థించారు. ఈ క్రమంలోనే నేడు పెద్దకర్మకు హాజరై.. మల్లయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గంగుల మల్లయ్యకు నలుగురు కుమారులు కాగా అందులో మంత్రి గంగుల కమలాకర్ చిన్న కుమారుడు.

గంగుల ఇంటికెళ్లి పరామర్శించిన బండి సంజయ్..: మంత్రి తండ్రి మరణం పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సైతం విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇటీవల మంత్రి గంగుల కమలాకర్‌ను కలిసి పరామర్శించారు. కరీంనగర్‌లోని మంత్రి నివాసానికి వెళ్లిన బండి సంజయ్‌.. ఆయన తండ్రి మల్లయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మంత్రి కమలాకర్‌ను పరామర్శించి యోగక్షేమాలు తెలుసుకొని మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన బండి సంజయ్‌.. గంగుల మల్లయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

ఇవీ చూడండి..

నేను ఖమ్మంలోనే ఉంటా.. కూకట్‌పల్లి నుంచి పోటీ చేయను: మంత్రి పువ్వాడ

రిమోట్ ఓటింగ్ యంత్రాలపై ఈసీ అవగాహన.. కొత్త విధానానికి విపక్షాలు నో!

ABOUT THE AUTHOR

...view details