తెలంగాణ

telangana

ETV Bharat / state

మిత్రుని మరణం-స్నేహితుల దాతృత్వం - friends donate

గుండెపోటుతో మరణించిన వ్యక్తి కుటుంబానికి మిత్రులు అండగా నిలిచారు. భవిష్యత్తులోనూ ఆదుకుంటామని భరోసానిచ్చారు.

మిత్రుని మరణం-స్నేహితుల దాతృత్వం

By

Published : Aug 19, 2019, 2:22 PM IST

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం జనగామకు చెందిన గౌడ శివాజీ ఈ నెల 10న గుండెపోటుతో మరణించాడు. శివాజీ మరణంతో భార్య, ఇద్దరు పిల్లలు రోడ్డున పడ్డారు. వారిని ఆదుకునేందుకు అతనితో కలిసి 2000-2001లో పదో తరగతి చదువుకున్న మిత్రులు ముందుకు వచ్చారు. ఇద్దరు ఆడపిల్లల పేర 50 వేల చొప్పున బ్యాంకులో ఫిక్స్​డ్​ డిపాజిట్​ చేశారు. భవిష్యత్తులోనూ వారి చదువులకు ఆర్థిక సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. స్నేహితుని కుటుంబాన్ని ఆదుకున్న మిత్రబృందాన్ని గ్రామస్థులు అభినందించారు.

మిత్రుని మరణం-స్నేహితుల దాతృత్వం

ABOUT THE AUTHOR

...view details