కరీంనగర్ జిల్లా పరిషత్ సమావేశానికి మంత్రులు గంగుల కమలాకర్, ఈటల రాజేందర్ హజరయ్యారు. ఈ సందర్భంగా జడ్పీ ఛైర్పర్సన్, ఇతర నేతలు మంత్రులను సత్కరించారు. సమావేశంలో పలువురు సభ్యులు ధాన్యం కొనుగోలు కేంద్రాల సమస్యలపై ప్రస్తావించారు. గత సీజన్‌లో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి దళారీలు ధాన్యం తీసుకొచ్చి తెలంగాణలో మద్దతు ధరకు అమ్ముకున్నారన్న అంశంపై విచారణ జరిపిస్తామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. నిజ నిజాలు తేలాక బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు పండించిన ప్రతిగింజ కొనుగోలు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
'రాష్ట్రంలో పండిన ప్రతి ధాన్యం గింజను కొంటాం' - Minister Kamalakar made it clear that irregularities in grain purchases will be curtailed
రైతులు ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కాకుండా దళారీలకు అమ్ముతున్నారన్న సమాచారంపై విచారణ చేపట్టామని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా పరిషత్ సమావేశంలో మంత్రి ఈటల రాజేందర్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు.
'రాష్ట్రంలో పండిన ప్రతి ధాన్యం గింజను కొంటాం'
ప్రజాప్రతినిధులు అన్ని సమస్యలపై దృష్టిసారించి పరిష్కరించేందుకు కృషి చేయాలని వైద్య ఆరోగ్యశాఖమంత్రి ఈటల రాజేందర్ సూచించారు. వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని చేతులు ముడుచుకోవద్దని ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు.
ఇదీ చూడండి: సాహసం... క్రమశిక్షణ... కలబోతే ఎన్సీసీ