కరీంనగర్‌లోని పద్మ నగర్లో సీఐటీయూ నేతలు వలస కార్మికులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. వలస కార్మికుల సమస్యలపై కలెక్టరేట్‌కు వెళ్లి అదనపు కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వలస కూలీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే వారు స్వస్థలాలకు వెళ్తున్నారని సీఐటీయూ నాయకులు అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన బియ్యం, 500 రూపాయల నగదు సరిగా ఇవ్వకుండా స్థానిక ప్రజాప్రతినిధులు దోచుకుంటున్నారని ఆరోపించారు.
వలస కార్మికుల సమస్యలపై సీఐటీయూ నిరసన - corona virus
కరీంనగర్లో వలస కార్మికుల సమస్యలపై సీఐటీయా నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. కలెక్టరేట్‌కు వెళ్లి అదనపు కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వం ప్రకటించిన బియ్యం, నగదు స్థానిక ప్రజాప్రతినిధులు దోచుకుంటున్నారని.. ఈ విషయంపై కలెక్టర్ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.
వలస కార్మికుల సమస్యలపై సీఐటీయూ నిరసన
దీనిపై జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. వలస కార్మికుల కోరిక మేరకు వారికి తగిన ఏర్పాట్లు చేయాలని, లేకపోతే స్వగ్రామం చేరే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిచో కలెక్టరేట్ ముందు వలస కార్మికులతో ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
ఇవీ చూడండి: ఊరికే కాదు.. ఊరిలో చింతకూ కాపలా!