కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ రైల్వేస్టషన్ ఎదుట రైల్వే ప్రైవేటీకరణను ఆపాలని సీఐటీయూతో పాటు పలు సంఘాల జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్లకార్డులు పట్టుకొని రైల్వే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మోదీ ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టేందుకే ఈ ప్రైవేటీకరణ చేపట్టిందని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శులు రమేష్, సత్యం ఆరోపించారు. దేశ ప్రజలు ప్రభుత్వ రంగ రైల్వే వ్యవస్థను కాపాడుకోవాలని కోరారు.
రైల్వే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రైల్వేస్టేషన్ ముందు నిరసన - citu-leaders-protest-at karimnagar railway statiom
రైల్యే ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూతో పాటు పలు సంఘాల నాయకులు కరీంనగర్ రైల్వే స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఇప్పటికైనా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

రైల్వే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కరీంనగర్ రైల్వేస్టేషన్ వద్ద నిరసన
ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల్లో నిర్వీర్యం చేసే కుట్రలను మానుకోవాలని అన్నారు. లేనిపక్షంలో ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, ఉపాధ్యక్షులు శేఖర్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:మహారాష్ట్రలో ఒక్కరోజే కరోనాతో 258 మంది మృతి