తెలంగాణ

telangana

ETV Bharat / state

ఊరికే కాదు.. ఊరిలో చింతకూ కాపలా!

కరీంనగర్ జిల్లా చిన్న మూల్కనూర్​లో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ శిఖం భూమిలో ఉన్న చింత చెట్టుకు వీఆర్​ఏను కాపలా పెట్టారు. ఇరు వర్గాల మధ్య వివాదం చేసుకోవడం వల్ల రెవెన్యూ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు.

chunnamulkanur revenue assistant security for tamarind tree
ఊరికే కాదు.. ఊరిలో చింతకూ కాపలా!

By

Published : May 10, 2020, 3:59 PM IST

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూరులో... 15 రోజులుగా వీఆర్​ఏ చింతచెట్టుకు కాపలా కాస్తున్నాడు. గ్రామంలోని రెండు వర్గాలు చింతకాయ కోసం గొడవ పెట్టుకుంటున్నారు. అందుకే రెవెన్యూ అధికారులు తనను కాపలా ఉంచినట్లు చెబుతున్నాడు. ప్రభుత్వ శిఖం భూమిలో ఉన్న చింత చెట్టు కాయ మాకే చెందాలని ఓ వర్గం... 15 సంవత్సరాలుగా సదరు వ్యవసాయ భూమి కబ్జాలో ఉన్నామంటూ మరో వర్గం మధ్య వైరం సాగుతున్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు.

ఇరు వర్గాల వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రస్తుతం వివాదం కోర్టు పరిధిలో ఉంది. లాక్​డౌన్​ పూర్తయ్యే వరకు చింతకాయ ఎవరూ తెంపకుండా తహసీల్దార్​ సూచనల మేరకు వీఆర్​ఏను కాపలా పెట్టారు. ఇరు వర్గాలకు కాకుండా గ్రామపంచాయతీ చింతకాయ తీసుకొన్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా చింత చెట్టుకు ఓ వీఆర్​ఏ కాపలా ఉండటం విశేషం.

ఇదీ చూడండి:సర్కార్​పై రజనీ ఫైర్- మద్యం అమ్మకాలపై హెచ్చరికలు

ABOUT THE AUTHOR

...view details