కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ 74వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు. మాతృదేశ స్వేచ్ఛ, స్వపరిపాలన కోసం స్వాతంత్య్ర సమరయోధులు అసమాన త్యాగాలు చేశారని గుర్తు చేశారు.
'కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాలకు స్వాతంత్య్ర ఫలాలు'
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా చొప్పదండిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ జాతీయ జెండాను ఎగురవేశారు. భారతదేశ స్వేచ్ఛ కోసం సమరయోధులు చేసిన అసమాన త్యాగాలను ఎమ్మెల్యే గుర్తు చేశారు.
చొప్పదండి ఎమ్మెల్యే కార్యాలయంలో పంద్రాగస్టు వేడుకలు
ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావంతో తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందేలా తెరాస ప్రభుత్వం కృషి చేస్తోందని సుంకె రవిశంకర్ అన్నారు. పంద్రాగస్టు వేడకల్లో మున్సిపల్ ఛైర్పర్సన్ నీరజ, మార్కెట్ ఛైర్మన్ ఆరెల్లి చంద్రశేఖర్ గౌడ్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి:ఎర్రకోటపై మువ్వన్నెల జెండా రెపరెపలు