కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణంలో బతుకమ్మ చీరల పంపిణీని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీకి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టారని అన్నారు.
బతుకమ్మ చీరల పంపిణీని ప్రారంభించిన ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ - telangana bathukamma sarees distribution
తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ దేశంలో ప్రత్యేకతను చాటుకుంటోందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. చొప్పదండి పట్టణంలో బతుకమ్మ చీరల పంపిణీని ఎమ్మెల్యే ప్రారంభించారు.
బతుకమ్మ చీరల పంపిణీని ప్రారంభించిన ఎమ్మెల్యే
తెలంగాణ ఆడపడుచులు పండుగను ఘనంగా నిర్వహించుకోవాలనే సంకల్పంతో ఏటా బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నట్టు వెల్లడించారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ దేశంలో ప్రత్యేకతను చాటుకుంటోందని అన్నారు.
ఇవీ చూడండి: త్వరలోనే కవితక్క మంత్రి అవుతుంది: ఎమ్మెల్యే షకీల్