తెలంగాణ

telangana

ETV Bharat / state

నిరుపేద విద్యార్థినికి ఎమ్మెల్యే ఆర్థిక సాయం

కరీంనగర్​ జిల్లాలో ఓ నిరుపేద విద్యార్థిని పైలట్ శిక్షణకు చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ రూ. లక్ష 30వేల ఆర్థిక సాయాన్ని అందించారు. గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులు విద్య, ఉద్యోగ సాధనలో ముందుండాలని ఆయన ఆకాంక్షించారు.

choppadandi mla ravishankar
నిరుపేద విద్యార్థినికి చొప్పదండి ఎమ్మెల్యే ఆర్థిక సాయం

By

Published : Dec 31, 2020, 1:15 PM IST

కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం మంగళపల్లికి చెందిన నిరుపేద విద్యార్థిని పెద్దెల్లి ఆపేక్ష.. ఇటీవలే తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీలో కమర్షియల్ పైలెట్ ట్రైనింగ్​కు ఎంపికయ్యింది. కానీ శిక్షణ కోసం రూ.2 లక్షల 50వేలు ఫీజు చెల్లించలేక నిరాశకు గురైంది. విషయం తెలుసుకున్న చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ రూ.లక్ష 30వేల ఆర్థిక సాయాన్ని అందించారు.

నిరుపేద దళిత విద్యార్థిని ప్రతిభను అభినందించడంతో పాటు భవిష్యత్​లో ఆమెకు అండగా ఉంటామని అన్నారు. గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులు విద్యా, ఉద్యోగ సాధనలో ముందుండాలని ఆకాంక్షించారు. చొప్పదండి సహకార సంఘం మరో లక్ష రూపాయలు రుణం మంజూరు చేసింది. విద్యార్థిని తల్లిదండ్రులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చదవండి: పాతబస్తీ రౌడీషీటర్ల ఇళ్లలో ఆకస్మిక తనిఖీలు

ABOUT THE AUTHOR

...view details