కరీంనగర్ జిల్లా జమ్మికుంట శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వేద పండితులు ప్రత్యేక పూజాలు చేసి శ్రీవేంకటేశ్వరస్వామి కల్యణాన్ని వైభవంగా జరిపారు. ఉత్సవ మూర్తులను ప్రత్యేక రథంపై పట్టణంలో పలు వీధులగుండా తిరువీధోత్సవాలు నిర్వహించారు. విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు.
తిరువీధోత్సవాల్లో ఆలరించిన చిన్నారుల నృత్యాలు - శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనం
జమ్మికుంట శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం వేద పండితులు ప్రత్యేక పూజలు చేసి తిరువీధోత్సవాలు నిర్వహించారు.
తిరువీధోత్సవాల్లో ఆలరించిన చిన్నారుల నృత్యాలు
చిన్నారులు స్వామివారి వేషధారణను ధరించి, భక్తి పాటలకు నృత్యాలు చేశారు. భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని తరించారు.
ఇదీ చూడండి :'సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిది'