తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈ అనాథ పిల్లలకు ఆసరా ఎవరు..? - etv bharath

కన్న తల్లిదండ్రులు నాలుగేళ్ల కిత్రం చనిపోయారు. పెంచిన నాన్నమ్మనూ భగవంతుడు తీసుకెళ్లాడు. ఇప్పుడు ఆ ఇద్దురు పిల్లలు అనాథలుగా మిగిలారు. ఉండానికి ఇల్లు లేక పక్కింట్లో తలదాచుకుంటున్నారు. ఇది కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం రుద్రవరం గ్రామానికి చెందిన గుర్రం నవిత, గుర్రం నవీన్ పరిస్థితి. తమను దాతలు ఆదుకోవాలని ధీనంగా కోరుతున్నారు.

Children who have become orphans in karimangar district
ఈ అనాథ పిల్లలకు ఆసరా ఎవరు..?

By

Published : Sep 16, 2020, 10:27 AM IST

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం రుద్రవరం గ్రామానికి చెందిన గుర్రం పరుశరాములు, కవిత దంపతులు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించే వారు. వీరికి ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. నాలుగు సంవత్సరాల క్రితం పరుశరాములు, కవిత అనారోగ్యంతో మృతి చెందారు.

వీరి పిల్లలైన గుర్రం నవిత(15), గుర్రం నవీన్(6)ను నానమ్మ సత్తవ్వ చూసుకుంది. వీరికున్న ఏకైక ఆస్తి పెంకుటిల్లు. ఇది కూడా కూలిపోవడం వల్ల పక్కింట్లో కాలం గడుపుతున్నారు. ఇటీవలే వీరి నానమ్మ అనారోగ్యంతో కన్నుమూసింది. దీంతో చిన్నారులు అనాథలయ్యారు. గూడు చెదిరిన పక్షులయ్యారు. తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి: అన్నదాతకు ఇదా వెన్నుదన్ను?

ABOUT THE AUTHOR

...view details