తెలంగాణ

telangana

ETV Bharat / state

దూర ప్రాంతాల నుంచి వచ్చేవారి కోసం... అన్నదాన కేంద్రం - తెలంగాణ తాజా వార్తలు

కరీంనగర్ జిల్లా రిజిస్టర్డ్‌‌ చిట్‌ఫండ్ అసోసియేషన్‌ అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించింది. కరీంనగర్​ బస్టాండ్‌ సమీపంలో ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు.

Charity center near karimnagar Bus Stand
బస్టాండ్‌ సమీపంలో అన్నదాన కేంద్రం

By

Published : Feb 27, 2021, 6:51 PM IST

దూర ప్రాంతాల నుంచి వచ్చి భోజనం కోసం ఇబ్బంది పడే వారి కోసం కరీంనగర్ జిల్లా రిజిస్టర్డ్‌‌ చిట్‌ఫండ్ అసోసియేషన్‌ అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టింది. మొదట ప్రతినెల చివరి శనివారం ఈ అన్నదానం ప్రారంభించినప్పటికీ... క్రమంగా మరిన్ని రోజులు పెంచే అవకాశం ఉందని సభ్యులు తెలిపారు.

వివిధ పనులపై వచ్చి భోజనం కోసం ఇబ్బంది పడకుండా ఉండేందుకు.. కరీంనగర్​ బస్టాండ్‌ సమీపంలో ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగించనున్నట్లు రిజిస్టర్డ్‌‌ చిట్‌ఫండ్ అసోసియేషన్‌ సభ్యులు వెల్లడించారు.

ఇదీ చూడండి :కళాశాలలు అగ్నిమాపక నిబంధనలు పాటించాల్సిందే: హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details