హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో నాయకుల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్ల పర్వం కొనసాగింది. భాజపా, తెరాస నాయకులు ఒకరిని మించి మరొకరు ఛాలెంజ్‌లు చేసుకుంటున్నారు. ఉప ఎన్నికల్లో తమ ప్రభావం కోల్పోకుండా, పట్టు సడలకుండా ఉండాలని చేస్తున్న ప్రయత్నాల్లో ప్రధాన పార్టీల నాయకులు మునిగి తేలుతున్నారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఒకరిపై ఒకరు విసురుకున్న ఈ సవాళ్లకు ప్రత్యర్థి పార్టీలు మాత్రం స్పందించ లేదు. కానీ, పోలింగ్ తేదీ సమీపిస్తున్నా కొద్దీ వీరి సవాళ్ల పర్వం పెరిగిపోయింది. ఓటర్లను తమకు అనుకూలంగా మల్చుకునేందుకు వారి అభివృద్ధి కోసం ఏం చేయబోతున్నారో చెప్పడం లేదు కానీ.. ఒక పార్టీ నాయకులు చేసిన కామెంట్లకు మరో పార్టీ నాయకులు స్పందిస్తూ సవాళ్లు మాత్రమే విసురుకుంటున్నారు.
సవాళ్లకు జవాబుగా.. ప్రతి సవాళ్లే...
భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌తో పాటు, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పలువురు నాయకులు సవాళ్లు విసిరి బహిరంగ చర్చకు రావాలని తెరాస ముఖ్య నాయకులకు సవాల్ విసిరారు. హుజూరాబాద్‌లో తనతో పాటు పోటీ చేసేందుకు దమ్ముంటే సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావులు రావాలని ఈటల సవాల్ విసిరారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కంప్లీట్ చేయలేకపోయారని మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలకు స్పందించిన ఈటల.. బహిరంగ చర్చకు రావాలన్నారు. హుజూరాబాద్ అభివృద్ధి విషయంలో కూడా అంబేడ్కర్ చౌరస్తాలో చర్చకు రావాలని డిమాండ్ చేశారు. దళిత బంధు పథకాన్ని నిలిపివేయాలని ఈసీకి భాజపా లేఖ రాయలేదని ఇందుకు తడిగుడ్డలు కట్టుకొని తాను చెల్పూర్ పోచమ్మ గుడికి వస్తానని, సీఎం కేసీఆర్ వస్తాడా అంటూ ఈటల సవాల్ విసిరారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సమయంలో దళిత బంధు పథకం నిలిపివేయాలంటూ ఈటల రాసినట్టుగా వైరల్ అయిన లేఖపై స్పందించిన రాజేందర్ తాను ఆ లేఖ రాయలేదని ఫేక్ లెటర్ సృష్టించారని మండిపడ్డారు. ఈ లేఖ తాను రాసినట్టు నిరూపిస్తే తాను దేనికైనా సిద్ధమేనని ఈటల ప్రకటించారు.
బహిరంగచర్చ కోసం ఎదురు చూసిన నేతలు