కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం చాకుంట రైతులు రోడ్డెక్కారు. ధాన్యం కొనుగోలులో ప్రతి 40 కిలోల బస్తాకు ఆరు కిలోలు తరుగు పేరిట వసూలు చేస్తున్నారని నిరసనకు దిగారు. మొదట్లో రెండు కిలోలు తరుగు పేరిట తీసుకున్నారని తాజాగా ఆరు కిలోలు కోత విధించటం అన్యాయమని వాపోయారు.
'తరుగు పేరిట దోపిడిని అరికట్టాలి' - Stop exploitation in the name of depletion of grain buying centres
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరిట దోపిడీని అరికట్టాలని కోరుతూ కరీంనగర్ జిల్లా చాకుంట రైతులు రాస్తారోకో నిర్వహించారు. గంటసేపు రహదారిపై నిరసన చేయటం వల్ల వాహనాలు భారీగా నిలిచిపోయాయి. అధికారులు హామీ ఇవ్వటం వల్ల అన్నదాతలు ఆందోళన విరమించారు.
!['తరుగు పేరిట దోపిడిని అరికట్టాలి' Chakunta Farmers Strike on Road Due to Stop exploitation in the name of depletion of grain buying centres](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7352526-1021-7352526-1590487318715.jpg)
'తరుగు పేరిట దోపిడిని అరికట్టాలి'
కరీంనగర్ - మంచిర్యాల రహదారిపై బైఠాయించటంతో వాహనాలు నిలిచిపోయాయి. భౌతిక దూరాన్ని పాటిస్తూ రైతులు రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. గంట సేపు ఆందోళన చేయటంతో తహసీల్దార్ సరిత, ఎస్సై వంశీకృష్ణ చేరుకుని రైతులకు నచ్చజెప్పారు. ధాన్యంలో కోత విధించకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీనివల్ల రైతులు ఆందోళన విరమించారు.