తెలంగాణ

telangana

ETV Bharat / state

జలశక్తి అభియాన్​తో ప్రజల్లో మార్పు - Central Jalashakti Abhiyan Team Members tour in Karimnagar district

కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో జలసంరక్షణ పనులను జలశక్తి అభియాన్ బృందం సభ్యులు పరిశీలించారు. నీటి సంరక్షణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

జలశక్తి అభియాన్​తో ప్రజల్లో మార్పు

By

Published : Nov 6, 2019, 7:47 PM IST

కేంద్ర ప్రభుత్వ జల శక్తి అభియాన్ అధికారులు సతిందర్ పాల్ సింగ్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో పర్యటించారు. రంగశాయిపల్లి గ్రామంలో చేపట్టిన ఇంకుడు గుంతల నిర్మాణం పనులను పరిశీలించారు. ఇంటింటికి వెళ్లి జల సంరక్షణ ఆవశ్యకతను అధికారులు తెలియజేశారు. నీటి కొరత సమస్య ఏర్పడకుండా స్థానికంగా వర్షపు నీరు ఇంకేవిధంగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సహజ వనరుల పరిరక్షణ అవగాహన పెంచుకోవాలని కోరారు. ఊట కుంటలు నిర్మించటం వల్ల భూమి కోత నుంచి రక్షించు కోవచ్చని తెలియజేశారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి వెంకటేశ్వరావు స్థానికంగా జల సంరక్షణ పనులను కేంద్ర బృందం అధికారులకు వివరించారు.

జలశక్తి అభియాన్​తో ప్రజల్లో మార్పు

ABOUT THE AUTHOR

...view details