ఉగాదిని పురస్కరించుకుని.. కరీంనగర్లోని శ్రీ వీరబ్రహ్మేంద్ర అనాథాశ్రమంలో వేడుకలు ఘనంగా జరిగాయి. మేము సైతం యువసేన ఫౌండేషన్ సభ్యులు.. వృద్ధులకు బట్టలు, నిత్యవసరాలను అందించారు.
'వృద్ధులను.. చిన్న చూపు చూడకండి'
కరీంనగర్లోని ఓ అనాథాశ్రమంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఓ స్వచ్ఛంద సంస్థ.. వృద్ధులకు బట్టలు, నిత్యావసరాలను పంపిణీ చేసింది. అందరూ.. వృద్ధుల పట్ల ప్రేమ, జాలి చూపించాలని సంస్థ సభ్యులు కోరారు.
వృద్ధ అనాథాశ్రమంలో ఉగాది
వృద్ధులను.. ఎవరూ చిన్న చూపు చూడకూడదని సంస్థ అధ్యక్షురాలు చక్కిలం స్వప్న కోరారు. వారి పట్ల ప్రేమ, జాలి చూపించాలని కోరారు. పండగను అనాథలతో జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. నిరాదరణకు గురైన వారికి.. తామెప్పుడూ సహకారం అందిస్తూనే ఉన్నామని ఆమె వివరించారు.
ఇదీ చదవండి:ప్లవనామ సంవత్సరంలో కొవిడ్ అంతం కావాలి: గవర్నర్