కరీంనగర్ గ్రానైట్ మైనింగ్ అక్రమాలపై సీబీఐ విచారణ
19:40 February 18
కరీంనగర్ గ్రానైట్ మైనింగ్ అక్రమాలపై సీబీఐ విచారణ
Karimnagar Granite Mining: కరీంనగర్ గ్రానైట్ మైనింగ్ అక్రమాలపై సీబీఐ, ఈడీ విచారణ చేపట్టాయి. భాజపా నేత పేరాల శేఖర్‌రావు ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన సీబీఐ విశాఖ విభాగం అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. కాకినాడ పోర్టు నుంచి కరీంనగర్ గ్రానైట్ విదేశాలకు ఎగుమతి అయింది. 2011లో కాకినాడ పోర్టులో సోదాలు నిర్వహించిన అధికారులు అక్రమంగా గ్రానైట్ విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్టు గుర్తించారు.
అక్రమ ఎగుమతులపై పలు సంస్థలకు నోటీసులు ఇచ్చిన అధికారులు భారీగా జరిమానా విధించారు. అప్పట్లో మైనింగ్ కంపెనీలకు రూ.750 కోట్ల జరిమానా విధించినట్టు భాజపా నేత శేఖర్‌రావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా సీబీఐ, ఈడీ రంగంలోకి దిగాయి. పన్ను ఎగవేత, మనీలాండరింగ్, అక్రమ మైనింగ్, అక్రమ రవాణా, ఎగుమతులపై కేంద్ర విచారణ సంస్థలు, సీబీఐ, ఈడీ దర్యాప్తు చేపట్టాయి.
ఇదీ చదవండి: