CBI on Granite Illegal Mining: కరీంనగర్ గ్రానైట్ గనుల తవ్వకాలు, ఎగుమతుల్లో పెద్దఎత్తున అక్రమాలు జరిగాయని, అందుకు కారణమైన అధికారులు, బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ అందిన ఫిర్యాదుపై సీబీఐ స్పందించింది. ఈ మేరకు విశాఖ విభాగానికి సంబంధించిన అధికారులకు సీబీఐ కేంద్ర కార్యాలయం సమాచారం పంపగా.. వారు విచారణ ప్రారంభించినట్లు తెలిసింది. కరీంనగర్ జిల్లాలోని పలు సంస్థలు గ్రానైట్ తవ్వకాలు, ఎగుమతుల్లో పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడ్డాయంటూ భాజపా నేత పేరాల శేఖర్‌రావు గత ఏడాది జనవరి 11న దిల్లీ సీబీఐ కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. దీన్ని పరిశీలించాల్సిందిగా దిల్లీ సీబీఐ అధికారులు విశాఖపట్నం విభాగానికి లేఖ రాశారు. ఫిర్యాదు కాపీలో 2013 నాటి ఆంధ్రప్రదేశ్ విజిలెన్స్ విభాగం నివేదిక లేదని, దాన్ని కూడా పంపాలంటూ విశాఖపట్నం సీబీఐ ఎస్పీ విమలాదిత్య ఫిర్యాదుదారు శేఖర్‌రావుకు ఈ ఏడాది జనవరి 19న లేఖ రాశారు. ఈ మేరకు విజిలెన్స్ నివేదిక పంపినట్లు శేఖర్‌రావు తెలిపారు. ఈ నివేదిక ఆధారంగా విశాఖపట్నం సీబీఐ అధికారులు విచారణ చేపట్టారు. ఇదే అంశంపై కేంద్ర ప్రభుత్వానికి భాజపా ఎంపీ బండి సంజయ్ 2019 జులైలో ఫిర్యాదు చేయగా.. మహేందర్‌రెడ్డి 2021 జులై 8న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి ఫిర్యాదు చేశారు.
అక్రమంగా 7.68 లక్షల క్యూబిక్ మీటర్ల గ్రానైట్ ఎగుమతి
CBI on Granite Mining in Karimnagar : మొత్తం 7.68 లక్షల క్యూబిక్ మీటర్ల గ్రానైట్‌ను కాకినాడ, కృష్ణపట్నం, చెన్నై, వైజాగ్ పోర్టుల నుంచి అక్రమంగా విదేశాలకు ఎగుమతి చేశారని, దీనికి సంబంధించి సీనరేజీగా చెల్లించాల్సిన సుమారు రూ.125 కోట్లు ఎగ్గొట్టారని, పెనాల్టీలో కలుపుకుంటే ఇది రూ.749.66 కోట్లు అవుతుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కరీంనగర్‌కు చెందిన తొమ్మిది సంస్థలు అక్రమాలకు పాల్పడ్డాయని ఫిర్యాదులో శేఖర్‌రావు తెలిపారు.
అసలేం జరిగిందంటే