కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని అల్గునూరు వద్ద మానేరు వంతెనపై ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి వంతెనపై నుంచి కిందపడింది. ప్రమాదంలో శ్రీనివాస్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా...అతని భార్య స్వరూప తీవ్రగాయాలపాలైంది.
వంతెన పైనుంచి కారు పల్టీ..ఒకరు మృతి - car fell down from bridge in karimnagar
కరీంనగర్ జిల్లా అల్గునూరు వద్దనున్న మానేరు వంతెనపై నుంచి కారు అదుపుతప్పి కింద పడింది. ఘటనలో భర్త మృతి చెందగా.. భార్యకు తీవ్రగాయాలయ్యాయి.
![వంతెన పైనుంచి కారు పల్టీ..ఒకరు మృతి car fell down from bridge in karimnagar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6090623-thumbnail-3x2-car.jpg)
మానేరు వంతెనపై నుంచి కిందపడ్డ కారు.. ఒకరు మృతి
మృతుడు శ్రీనివాస్ కరీంనగర్ వాసిగా పోలీసులు గుర్తించారు. ఉప్పరిమల్యాల ప్రభుత్వ పాఠశాలలో శ్రీనివాస్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. కొమురవెల్లి మల్లన్న దర్శనానికి వెళ్తుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు. వంతెన పైనుంచి ప్రమాదం జరిగిన తీరు పరిశీలిస్తున్న కానిస్టేబుల్ ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.
మానేరు వంతెనపై నుంచి కిందపడ్డ కారు.. ఒకరు మృతి
ఇదీ చూడండి:కేసీఆర్ కటౌట్... మంత్రి తలసానికి జరిమానా
Last Updated : Feb 16, 2020, 12:28 PM IST