కరీంనగర్ జిల్లా అలుగునూరు కాకతీయ కాలువలో బోల్తా పడి ముగ్గురు జలసమాదైన కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి సోదరి రాధికతో పాటు బావ, కోడలు వినయశ్రీ గత నెల 27న ఇంటి నుంచి కారులో బయలుదేరి వెళ్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు.
రేణిగుంట టోల్‌ప్లాజాలోని సీసీ ఫుటేజీని పోలీసులు సేకరించగా... జనవరి 26 న ఉదయం 11గంటలకు కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్లినట్లు దృశ్యాలు నమోదయ్యాయి. అదే రోజు రాత్రి 8:15 గంటలకు కారు కరీంనగర్‌కు తిరిగి వచ్చినట్లు దృశ్యాలు నమోదయ్యాయి.