పంట కొనుగోలు చేసి రైతులను ఆదుకోండి - Buy the crop and save the farmers in Karimnagar district
కరీంనగర్ జిల్లా చొప్పదండి వ్యవసాయ మార్కెట్లో తడిసిన వరి ధాన్యాన్ని తేమతో సంబంధం లేకుండా కొనుగోలు చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులను కోరారు.
![పంట కొనుగోలు చేసి రైతులను ఆదుకోండి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4980201-87-4980201-1573043038974.jpg)
పంట కొనుగోలు చేసి రైతులను ఆదుకోండి
ఖరీఫ్ పంట ధాన్యాన్ని సత్వరం కొనుగోలు చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం కోరారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి వ్యవసాయ మార్కెట్లో పక్షం రోజులుగా ధాన్యం కొనుగోళ్లకు ఎదురుచూస్తున్న రైతులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తేమతో సంబంధం లేకుండా మార్కెట్కు తరలించిన ధాన్యాన్ని జాప్యం చేయకుండా కొనుగోలు చేయాలని అధికారులను కోరారు. ధాన్యం కొనుగోళ్లలో ఉదాసీనంగా వ్యవహరిస్తే ఆందోళన ఉద్ధృతం చేస్తామన్నారు.
పంట కొనుగోలు చేసి రైతులను ఆదుకోండి