విద్యా సంస్థలకు సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో విద్యార్థులంతా స్వస్థలాలకు పయనమయ్యారు. విద్యార్థులతో కరీంనగర్ బస్టాండ్ కిటకిటలాడింది. సొంతూరికి వెళ్లేందుకు బస్సులో నిలబడి సైతం వెళ్తున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని అధికారులు చెబుతున్నా... అవి ఏ మాత్రం సరిపోవడం లేదు పలువురు తెలిపారు. తగినన్ని బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రయాణికులు వెల్లడించారు.
కిటకిటలాడిన బస్టాండు ప్రాంగణాలు - bus stands full rush at karimnagar
సంక్రాంతి సెలవులతో బస్టాండు ప్రాంగణాలన్నీ కిటకిటలాడాయి. సొంతూరికి వెళ్లేందుకు విద్యార్థులు ఉత్సాహం కనబరుస్తున్నారు.
కిటకిటలాడిన బస్టాండు ప్రాంగణాలు