Gangula Vs Ponnam Word War in karimnagar :అసెంబ్లీ ఎన్నికలుసమీపిస్తున్న వేళ...కరీంనగర్‌లో అధికార బీఆర్ఎస్, విపక్ష కాంగ్రెస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కరీంనగర్‌లో పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్‌ని బలహీనపరిచారని మంత్రి గంగుల విమర్శించగా.. ఓటమి భయం పట్టుకుందని పొన్నం తిప్పికొట్టారు. ఇరు పార్టీల శ్రేణులు పోటాపోటీ నిరసనలతో రాజకీయం వేడెక్కించారు.
Political Heat in Karimnagar :కరీంనగర్‌లో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. సాధారణ ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ రాజకీయ నేతలు విమర్శలకు పదునుపెడుతున్నారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ లక్ష్యంగాబీసీ సంక్షేమ శాఖ మంత్రి మండిపడ్డారు. పొన్నం రాజకీయ అసమర్ధుడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రభాకర్‌ను ప్రజలు పూర్తిగా మర్చిపోయారని యువతరం గుర్తుపట్టే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు.
'బండి సంజయ్, పొన్నం ప్రభాకర్ ఇద్దరు నాపై హైకోర్టులో కేసు వేశారు. సీబీఐ, ఈడీ, కోర్టు కేసులు అన్ని వేసింది వీరిద్దరే. పొన్నం పేరు తియ్యకండి ఆయన అవుట్‌డేటెడ్. 60 వార్డుల్లో కాంగ్రెస్‌కు వచ్చిన సీట్లు సున్నా. దానికి కారణం పొన్నం ప్రభాకర్ ఇంకా దాని గురించి నేను ఏం మాట్లాడాలి. కరీంనగర్ చరిత్రలో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా రాకుండా ఉందా అంటే ఉంది దానికి కారణం పొన్నం ప్రభాకర్ కదా. ఇంకా ఆయన వాల్యూ గురించి నేనేం చెప్పాలి. నేను ఏ రాజకీయ నాయకుడి దగ్గరికి పోను కానీ నా దగ్గరికి వస్తే మాత్రం వదలను. నువ్వు బీజేపీని గెలిపించావు.' - గంగుల కమలాకర్, బీసీ సంక్షేమశాఖ మంత్రి