కరీంనగర్ జిల్లా గంగాధర మండలం సర్వారెడ్డిపల్లిలో రోడ్డు కోసం ఓ బాలుడు చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ను ప్రశ్నించాడు. గ్రామంలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసేందుకు ఎమ్మెల్యే చేరుకున్నారు. స్థానికులతో మాట్లాడుతూ ఉండగా బాలుడు యశ్వంత్ తమ కాలనీకి రోడ్డు కావాలని అడిగాడు.
మా కాలనీకి రోడ్డు వేయండి.. ఎమ్మెల్యేకు బాలుడి విన్నపం
ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌కు వింత అనుభవం ఎదురైంది. మా కాలనీకి రోడ్డు వేయాలంటూ ఎమ్మెల్యే సుంకెకు ఓ బాలుడు విన్నవించాడు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే రోడ్డు పనులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.
మా కాలనీకి రోడ్డు వేయండి ఎమ్మెల్యే సుంకెకు బాలుడి విన్నపం
వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సుంకె రవిశంకర్... వెంటనే ఆ కాలనీకి సంబంధించిన రోడ్డు పని ఎస్టిమేషన్ వేయాలని అధికారులకు సూచించారు. సత్వరం రోడ్డు నిర్మించేందుకు ఆయన ఆదేశించారు. బాలుడి ధైర్యానికి ఎమ్మెల్యే ముగ్ధులయ్యారు.
ఇదీ చూడండి:ప్రజల సమాచారం ప్రభుత్వం సేకరిస్తే అంగీకరించం: హైకోర్టు