తెలంగాణ

telangana

ETV Bharat / state

కరీంనగర్‌లో ఈతకు వెళ్లి ముగ్గురు బాలురు మృతి

Boys die in Karimnagar after going swimming: కరీంనగర్‌లో హోళీ పండగ పూట విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని మానేరు వాగులో ఈతకు వెళ్లిన ముగ్గురు బాలురు మృతి చెందగా.. మరో బాలుడు బాలుడు గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు మృత దేహాలను వెలికితీయగా.. మరో బాలుడి కోసం గాలిస్తున్నారు. తీగల బ్రిడ్జ్​ పనుల నిమిత్తం తీసిన గోతులే పిల్లల ప్రాణాలు తీశాయని తల్లిదండ్రులు రోదిస్తున్నారు.

Boys die in Karimnagar
Boys die in Karimnagar

By

Published : Mar 7, 2023, 6:27 PM IST

Updated : Mar 7, 2023, 10:07 PM IST

Boys die in Karimnagar after going swimming: స్థానికుల కథనం జిల్లాలోని కరీంనగర్​ జిల్లాలోని మానేరు వాగులో ఇవాళ మధ్యాహ్నం ముగ్గుర బాలురు స్నానం కోసమని వెళ్లారు. వారు ఎంతకి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. సాయంత్రం కావడంతో మరింత ఆందోళన చెందిన తల్లిదండ్రులు మానేరు వాగు సమీపంలో పిల్లల కోసం వెతికారు.

వాగులో తీగల బ్రిడ్జ్​ పనుల నిర్మాణం కోసమని పెద్ద పెద్ద బండ రాళ్లను తొలగించగా వాటి వలన ఏర్పడిన గోతిలో పిల్లలు విగత జీవులుగా తెలియాడడం చూసి తల్లిదండ్రులు చలించిపోయారు. దీంతో వారి రోదనలు మిన్నంటాయి. స్థానికుల సహాయంతో వారిని ఒడ్డుకు చేర్చగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు కేసు నమోదు చేసుకొని మిగిలిన స్నేహితుల గురించి ఆరా తీశారు.

మృతి చెందిన పిల్లలను సంతోశ్, విరాంజనేయులు, అనిల్​గా గుర్తించారు. వీరి తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్​లోని ప్రకాశం జిల్లాకు చెందినవారు. కూలీ పనులు నిమిత్తం కరీంనగర్​ వలస వచ్చి పిల్లలతో ఇక్కడే జీవిస్తున్నారు. పిల్లలందరూ 14, 15 సంవత్సరాలకు చెందిన వారు కావడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎక్కడి నుంచో పొట్టకూటి కోసమని పనులు నిమిత్తం ఇక్కడకు వస్తే ఇలా జరిగిందని వారు రోదించారు.

స్థానికుల ఆందోళన: మరోవైపు అధికారుల నిర్లక్ష్యం వలనే పిల్లలు మృతి చెందినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. వాగులో పనుల కోసమని బండరాళ్లు తీసిన తరువాత ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బండరాళ్లు తొలగించక పోవడం వల్ల ఏర్పడిన గోతులను వేగంగా పూడ్చాలని కోరుతున్నారు. ఆ గోతుల్లో నీరు చేరడంతో పిల్లలు వాటిలో స్నానానికి వెళ్లి తరచూ ప్రమాదాలకు లోనవుతున్నారని మండిపడుతున్నారు.

అటు వేసవి కాలం ప్రారంభమైనందున చెరువుల్లో ఈతకు వచ్చే చిన్నారులు ఎక్కువ మందే ఉంటారని.. మరో ఘటన జరగకుండా వెంటనే గోతులు పూడ్చాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మృతి చెందిన పిల్లల కుటుంబాలకు మంత్రి గంగుల కమలాకర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం నుంచి 3లక్షలు, తాను స్వయంగా 2లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.

మరోవైపు వేసవి కాలమైనందున పిల్లలు ఈత కోసం చెరువుల వద్దకు వెళితే జాగ్రత్తలు సూచించాలని పోలీసులు స్థానికులకు వివరించారు. ఈత రాని వారిని వెళ్లకుండా చూసుకోవాలని.. వచ్చిన వారిని కూడా లోతుకు వెళ్లకుండా పెద్దలు ఓ కంట కనిపెట్టాలని సూచించారు.

ఇవీ చదవండి:

కొద్దిలో మరో ఘోరం తప్పింది.. బాలికను కరవబోయిన వీధి కుక్కలు

స్కూళ్లకు పాకిన ర్యాగింగ్.. జూనియర్స్‌ను చితకబాదిన సీనియర్స్

ఫోన్‌లో గేమ్స్ ఆడొద్దన్నందుకు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

ఇంట్లో ఏసీ పేలుడు.. మహిళ, ఇద్దరు చిన్నారులు సజీవదహనం.. మాజీ ప్రియుడి దారుణ హత్య

Last Updated : Mar 7, 2023, 10:07 PM IST

ABOUT THE AUTHOR

...view details