కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్ పుట్టిన రోజు వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. గోపీకృష్ణ ఫంక్షన్ హాల్లో మేయర్, డిప్యూటీ మేయర్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.
మంత్రి గంగుల పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం - blood donation on the occasion of gangula birthday
రాష్ట్ర పౌరసరసఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పుట్టిన రోజు సందర్భంగా కరీంనగర్లో కార్యకర్తలు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం కేకు కట్ చేసి సంబురాలు చేసుకున్నారు.

మంత్రి గంగుల పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం
ఈ కార్యక్రమంలో 52 మంది తెరాస కార్యకర్తలు, అభిమానులు రక్తదానం చేశారు. మేయర్ సునిల్ రావు రక్తదాతలకు పండ్ల రసం అందించారు. మంత్రి గంగుల ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నట్లు మేయర్ తెలిపారు.