తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం - blood donation on the eve of mla rasamai birthday

ఎమ్మెల్యే రసమయి బాలకిషన్​ జన్మదినం సందర్భంగా కరీంనగర్​ జిల్లా మానకొండూర్​ నియోజకవర్గంలో కార్యకర్తలు రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున యువత రక్తం దానం చేశారు.

blood donation camp on the occasion of mla rasamayi balakishan birthday
ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం

By

Published : May 15, 2020, 2:16 PM IST

లాక్​డౌన్​ వల్ల రాష్ట్రంలో రక్త నిల్వలు తగ్గిపోయి తలసేమియా వ్యాధిగ్రస్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ రక్తదానం చేయడానికి పెద్ద ఎత్తున ముందుకు రావాలని యువతకు పిలుపునిచ్చారు.

కరీంనగర్​ జిల్లా మానకొండూర్ నియోజకవర్గంలోని యువత, తెరాస కార్యకర్తలు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్​ జన్మదినాన్ని వేడుకగా చేసుకుని రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున దాతలు తరలి వచ్చి రక్తదానం చేశారు. తెరాస కార్యకర్తలు రక్తదానం చేసిన వారికి పండ్లు పంపిణీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details