పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సాల్లో భాగంగా కరీంనగర్ జిల్లా గంగాధర పోలీస్ స్టేషన్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. గ్రామీణ ఏసీపీ ఉషారాణి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. గంగాధర మండలానికి చెందిన సర్పంచులు, పోలీసు సిబ్బంది కూడా రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వారికి గ్రామీణ ఏసీపీ ఉషారాణి పండ్లు అందజేశారు. సీఐ రమేశ్, ఎస్సై వివేక్ ఈ శిబిరంను పర్యవేక్షించారు.
రక్తదానం చేసిన సర్పంచులు, పోలీసులు - కరీంనగర్ జిల్లా గంగాధర పోలీస్ స్టేషన్లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినం పురస్కరించుకుని రక్తదాన శిబిరం
కరీంనగర్ జిల్లా గంగాధర పోలీస్ స్టేషన్లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినం పురస్కరించుకుని రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని చేపట్టారు.
రక్తదానం చేసిన సర్పంచులు, పోలీసులు