కరోనా లాక్డౌన్ సమయంలో ఆర్థికంగా నష్టపోయిన ప్రైవేట్ టీచర్లని ఆదుకోవాలని కోరుతూ నల్గొండ జిల్లాలో నిరసనలు చేపట్టిన బీజేవైఎం కార్యకర్తలపై ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టడం తగదని కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి ఆరోపించారు. రెండు రోజుల క్రితం నల్గొండలో నిరసనలు చేపట్టిన బీజేవైఎం కార్యకర్తలపై ప్రభుత్వం కేసులు పెట్టడంపై ఆయన మండిపడ్డారు.
ప్రైవేట్ టీచర్లను ప్రభుత్వం ఆదుకోవాలి: బీజేవైఎం - bjym latest news
లాక్డౌన్తో ఆర్థికంగా నష్టపోయిన ప్రైవేట్ టీచర్లని ఆదుకోవాలని కోరుతూ నల్గొండలో నిరసనలు చేపట్టిన బీజేవైఎం(భారతీయ జనతా యువ మోర్చా) కార్యకర్తలపై ప్రభుత్వం కేసులు పెట్టడం తగదని కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి ఆరోపించారు. ఈ మేరకు జిల్లాలో కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు.

ప్రైవేట్ టీచర్లను ప్రభుత్వం ఆదుకోవాలి: బీజేవైఎం
ఈ మేరకు కరీంనగర్ కలెక్టరేట్ ముందు నిరసన చేపట్టారు. ఇప్పటికైనా ప్రైవేట్ టీచర్లను ప్రభుత్వం ఆదుకోవాలని కృష్ణారెడ్డి అన్నారు. బీజేవైఎం కార్యకర్తలపై ప్రభుత్వం దాడులకు పాల్పడితే ఆందోళనను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.