కరోనా కారణంగా గత కొన్ని నెలలుగా ప్రైవేటు ఉపాధ్యాయులకు జీతాలులేక వారి జీవితాలు దుర్భరంగా మారినా ముఖ్యమంత్రి కేసీఆర్ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని బీజేవైఎం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి.. అనంతరం కార్యాలయం లోపలికి దూసుకెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని అడ్డుకున్నారు.
'ప్రైవేటు ఉపాధ్యాయులను ప్రభుత్వమే ఆదుకోవాలి'
ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలతో ప్రభుత్వం కుమ్ముక్కై ప్రైవేటు ఉపాధ్యాయులను పట్టించుకోవడం లేదని బీజేవైఎం నాయకులు ఆరోపించారు. కరీంగనర్ కలెక్టరేట్ ముట్టడి యత్నించిన నేతలను పోలీసులు అడ్డుకున్నారు.
'ప్రైవేటు ఉపాధ్యాయులను ప్రభుత్వమే ఆదుకోవాలి'
ప్రధానమంత్రి మోదీ ఆత్మనిర్భర్ భారత్ పథకం కింద కోట్ల రూపాయలు రాష్ట్రాలకు ఇస్తున్నా ప్రభుత్వం మాత్రం ప్రైవేటు టీచర్లను ఆదుకోవడానికి ఎలాంటి ప్రయత్నం చేయడం లేదని విమర్శించారు. సర్కారు వెంటనే ప్రైవేటు ఉపాధ్యాయుల ఇబ్బందులు గమనించి వేతనాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి:వరంగల్ కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. బీజేవైఎం ముట్టడి భగ్నం