అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా నిరుద్యోగ భృతి ఇవ్వలేదని కరీంనగర్ జిల్లా బీజేవైఎం అధ్యక్షుడు మర్రి సతీశ్ ప్రశ్నించారు. ప్రభుత్వం ఇచ్చినా హామీలు అమలు చేయాలంటూ పట్టణంలోని ఎన్టీఆర్ కూడలి వద్ద రాస్తారోకో నిర్వహించారు. దీంతో రహదారిపై పెద్దఎత్తున వాహనాలు స్తంభించి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
నిరుద్యోగులపై సర్కారు వివక్ష: బీజేవైఎం - కరీంనగర్లో బీజేవైఎం ఆందోళన
రాష్ట్రప్రభుత్వం నిరుద్యోగులకు భృతి ఇవ్వకుండా మోసం చేసిందని బీజేవైఎం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు మర్రి సతీశ్ ఆరోపించారు. కరీంనగర్లోని ఎన్టీఆర్ కూడలి వద్ద రహదారిపై పెద్దఎత్తున ఆందోళన నిర్వహించారు.
నిరుద్యోగులకు భృతి చెల్లించాలంటూ బీజేవైఎం ఆందోళన
సమాచారం అందుకున్న పోలీసులు బీజేవైఎం కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఆందోళన విరమింప చేసే ప్రయత్నంలో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య కాసేపు ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. పోలీసులు బలవంతంగా వారిని సంఘటన స్థలం నుంచి ఠాణాకు తరలించారు.