BJP Jagarana deeksha : భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేడు జాగరణ దీక్ష చేపట్టనున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంఘీభావంగా... 317 జీవోను సవరించాలని డిమాండ్ చేస్తూ.. బండి సంజయ్ నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు.
BJP Jagarana deeksha : 'నిద్రపోతున్న సర్కారును మేల్కొల్పేందుకే జాగరణ దీక్ష' - తెలంగాణ భాజపా వార్తలు
BJP Jagarana deeksha : ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంఘీభావంగా నేడు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ‘జాగరణ’ దీక్ష చేయనున్నారు. 317 జీవోను సవరించేదాకా ఉద్యోగుల పక్షాన ఉద్యమించాలని భాజపా నిర్ణయించింది.
bandi sanjay
అందులో భాగంగా కరీంనగర్లో రాత్రి 9గంటల నుంచి రేపు ఉదయం 5గంటల వరకు జాగరణ దీక్ష చేయనున్నారు. నిద్రపోతున్న సర్కారును మేల్కొల్పడమే ‘జాగరణ’ లక్ష్యమని భాజపా తెలిపింది. నిరుద్యోగ, రైతుసహా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఏడాదంతా పోరుబాటకు సిద్ధమని భాజపా స్పష్టం చేసింది.
ఇదీ చూడండి:Rajasingh on GO 317: 'జీవో 317ను వెంటనే సవరించాలి'