తెలంగాణ

telangana

ETV Bharat / state

'కరోనా వ్యాక్సిన్‌పై మాట్లాడినవారు ఆత్మవిమర్శ చేసుకోవాలి' - Bandi Sanjay visist Huzurabad constituency

దేశ ప్రజలందరు కరోనాను ధైర్యంగా ఎదుర్కొంటున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌ నియోజకవర్గంలో పర్యటించిన ఆయన పెద్దపాపయ్యపల్లి గ్రామంలో ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

హుజూరాబాద్‌ నియోజకవర్గంలో పర్యటించిన బండి సంజయ్
హుజూరాబాద్‌ నియోజకవర్గంలో పర్యటించిన బండి సంజయ్

By

Published : Jun 7, 2021, 12:23 PM IST

కరోనా వ్యాక్సిన్‌ల గురించి మాట్లాడిన వారంతా ఇప్పుడు ఆత్మవిమర్శ చేసుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ నియోజకవర్గంలో పర్యటించిన ఆయన హుజూరాబాద్‌ మండలం పెద్దపాపయ్యపల్లి గ్రామంలో 15 కిలోల ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి ప్రతి ఒక్కరికీ కరోనా టీకాను వేయించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని బండి సంజయ్ అన్నారు. మొదటి, రెండో డోసుల వ్యాక్సిన్‌ పంపిణీలో వందకు వందశాతం విజయం సాధించామన్నారు. గరీబ్ కల్యాణ్‌ అన్నా యోజన పథకం కింద పేదలకు 10 కిలోల బియ్యాన్ని అందిస్తున్నామని పేర్కొన్నారు. ఆత్మనిర్బర్‌ భారత్ పథకం కింద రూ. 20 వేల కోట్లను ప్రధాని మోదీ విడుదల చేశారన్న బండి ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.


ఇదీ చదవండి:పెళ్లి మండపంలోనే ప్రియుడితో ఛాటింగ్.. పారిపోయేందుకు ప్లానింగ్

ABOUT THE AUTHOR

...view details