కరీంనగర్ భాజపా కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి నివాళులు అర్పించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధంజలి ఘటించారు. ప్రణబ్ మరణం తీరని లోటన్నారు.
ప్రణబ్ ముఖర్జీ మరణం తీరని లోటు: బండి సంజయ్ - bandi sanjay tributs to pranab mukharhji
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణం తీరని లోటని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కరీంనగర్లోని పార్టీ కార్యాలయంలో ప్రణబ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ప్రణబ్ ముఖర్జీ మరణం తీరని లోటు: బండి సంజయ్
అయన మొదటి నుంచి గొప్ప జాతీయ భావాలు గల వ్యక్తి అని అభివర్ణించారు. ప్రణబ్ ముఖర్జీ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి అయినప్పటికీ ఆర్ఎస్ఎస్ సభలకు హాజరైన మొట్టమొదటి వ్యక్తి అని పేర్కొన్నారు. అలాంటి గొప్ప వ్యక్తి చనిపోవడం దేశానికి తీరని లోటని చెప్పారు.
ఇదీ చదవండి:స్వచ్ఛమైన గాలి.. మట్టివాసన... ఫామ్‌టూర్స్‌కు నగరవాసులు