అకలితో అలమటిస్తున్న వారిని ఆదుకుంటున్నారు భాజపా రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్. కరీంనగర్లోని వివిధ ప్రాంతాల్లో పలువురికి భోజనాలు అందించారు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్ డౌన్ వల్ల ఆకలితో బాధపడుతున్న అన్నార్తులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.
అన్నార్తులను ఆదుకోండి: బండి సంజయ్ - coronavirus news
లాక్డౌన్తో చాలామంది పని లేక, తినడానికి తిండి లేక ఆకలితో అలమటిస్తున్నారు. ఒకే పూట తింటూ బతుకు వెళ్లదీస్తున్నారు. అలాంటి వారిని ఆదుకునేందుకు ముందుకు వచ్చారు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్. కరీంనగర్లోని వివిధ ప్రాంతాల్లో అన్నార్తులకు భోజనం అందించి మావత్వాన్ని చాటుకున్నారు.
అన్నార్తులను ఆదుకోండి: బండి సంజయ్
లాక్ డౌన్ పరిస్థితుల్లో పేదవారి ఆకలి తీర్చేందుకు పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక కార్యకర్తలు, వివిధ సంస్థల ప్రతినిధులు బాధ్యతగా పేదలకు ఆహారాన్ని అందించాలని కోరారు. ఏప్రిల్ 14 వరకు కొనసాగుతున్న కరోనా వైరస్ నివారణ చర్యలకు ప్రజలంతా సహకరించి ఇంటి వద్ద ఉండి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యలకు సహకరించాలని బండి సంజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి:కరోనాపై పోరాటానికి విరాళాల వెల్లువ