తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇకనైనా దుర్మార్గపు చర్యలు మానుకో, కేసీఆర్‌కు బండి హితవు - కేసీఆర్‌పై బండి సంజయ్ ఆరోపణలు

bandi sanjay fires on cm kcr భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాట్లాడిన ఆయన... తెరాస ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. పాదయాత్రను ప్రభుత్వం ఆపాలని కుట్రలు పన్నిందని ఆరోపణలు చేశారు. ఇలాంటి దుర్మార్గమైన చర్యలు మానుకోవాలని కేసీఆర్‌కు బండి సూచించారు.

bandi sanjay fires on cm kcr
bandi sanjay fires on cm kcr

By

Published : Aug 25, 2022, 6:45 PM IST

Updated : Aug 25, 2022, 7:24 PM IST

ఇకనైనా దుర్మార్గపు చర్యలు మానుకో, కేసీఆర్‌కు బండి హితవు

bandi sanjay fires on cm kcr ప్రజా సంగ్రామయాత్రను ఆపాలని ప్రభుత్వం కుట్రలు చేసిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి ఆరోపించారు. కరీంనగర్‌ హుజూరాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాట్లాడిన ఆయన తెరాస ప్రభుత్వంపై మండిపడ్డారు. బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో కోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు బండి సంజయ్‌ వెల్లడించారు.సీఎం కేసీఆర్‌.. ప్రధాని, భాజపా నేతలపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇకనైనా ప్రభుత్వం ఇలాంటి దుర్మార్గమైన చర్యలకు పాల్పడడం మానుకోవాలని హితవు పలికారు. కలెక్టరేట్ ప్రారంభం అనేది అధికారిక కార్యక్రమమన్న బండి.. కానీ అక్కడ రాజకీయ విమర్శలు సీఎం ఎలా చేస్తారని ప్రశ్నించారు. కేంద్రాన్ని, ప్రధానిని... సీఎం కేసీఆర్‌ ఎలా విమర్శిస్తారని విరుచుకుపడ్డారు. కేసీఆర్‌ అభివృద్ధి చేశానని అనుకుంటే.. ఏ జిల్లాకు పోతే అక్కడ ఏం చేశారో సీఎం చెప్పాలని సవాల్ విసిరారు. ఎంత మందికి ఇళ్లు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మిషన్ భగీరథ నీళ్లు పంపిస్తే.. తాగే దమ్ము సీఎంకు ఉందా? అని ప్రశ్నించారు.

''ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేయాలని సీఎం లేఖలు రాస్తున్నారు. సీఎం కేసీఆర్‌... దక్షిణ తెలంగాణను పూర్తిగా ఏడారి చేశారు. ఉన్న 299 టీఎంసీలను వాడుకోలేదు, 572 టీఎంసీల గురించి ఎందుకు కొట్లడరు. దక్షిణ తెలంగాణ జిల్లాలను ఎడారిగా మార్చిన ఘనత కేసీఆర్‌దే. సీఎం ఎక్కడ సభ పెట్టిన.. చేసిన అభివృద్ధి చెప్పాలి. పాదయాత్రలో ప్రతి నియోజకవర్గానికి కేంద్రం ఇచ్చిన నిధులు గురించి చెబుతున్నాం. వరి వేస్తే ఉరి అన్నది కేసీఆర్‌. మతవిద్వేషలు రగిల్చి... దానిని మాపై నెట్టలనుకుంటున్నారు.''- బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

మునావర్‌ను ప్లాన్‌ ప్రకారమే హైదరాబాద్‌ పిలిపించారని బండి సంజయ్ ఆరోపించారు. మునావర్‌కు 2 వేల మంది పోలీసులతో బందోబస్తా అని ఎద్దేవా చేశారు. చేసిన అభివృద్ధి గురించే తాము మాట్లాడుతున్నామని తెలిపారు. కేసీఆర్‌ ఎక్కడికి వెళ్లినా మతం గురించి మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. భాజపా 19 రాష్ట్రాల్లో అధికారంలో ఉందన్న బండి.. భాజపా అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మత ఘర్షణలు జరిగాయా? అని ప్రశ్నించారు.

''ఎంఐఎమ్, తెరాస కలిసి భాజపాపై కుట్ర చేస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాకు కేసీఆర్‌ చేసిన అభివృద్ధి గురించి చెప్పాలి. మేధావులు, కవుల గురించి కేసీఆర్‌ మాట్లాడటం హాస్యాస్పదం. కళాకారులు ..కేసీఆర్‌తో నాట్యాం చేయించాలి. '' - బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

ఇక రేపు ఉదయం మూడో విడత ప్రజాసంగ్రామ యాత్ర పునఃప్రారంభం కానుంది. షెడ్యూల్ ప్రకారం ఇవాళ యాత్ర ఎక్కడ ముగుస్తుందో అక్కడి నుంచి పున‌ఃప్రారంభించనున్నారు. ఈనెల 27న మూడో ప్రజా సంగ్రామ యాత్ర ముగియనుంది. పాదయాత్ర ముగింపు సందర్భంగా హనుమకొండలో బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. ఈ సభకు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Aug 25, 2022, 7:24 PM IST

ABOUT THE AUTHOR

...view details