కరోనా కేసులు పెరగడానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కరోనాతో మరణాలు పెరగాలని ఎవరూ కోరుకోరని తెలిపారు. కరోనాతో మరణించిన వనస్థలిపురానికి చెందిన మధుసూదన్ విషయంలోను, కేసుల లెక్కల్లోనూ పొంతన కుదరడంలేదని ఆరోపించారు. మధుసూదన్‌ను ప్రాణాలతో అప్పగిస్తే సీఎం కేసీఆర్‌ను సన్మానిస్తానని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో చేస్తున్నట్లు ఇక్కడా కరోనా పరీక్షలు చేస్తే మంత్రి కేటీఆర్‌కు బహుమతి పంపిస్తానన్నారు.
కేసీఆర్‌ను సన్మానిస్తా.. కేటీఆర్‌కు గిఫ్ట్ ఇస్తా..: బండి సంజయ్
హైదరాబాద్‌లో కరోనా కేసులు పెరగడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. కరోనా లెక్కల విషయంలో ప్రభుత్వం, గాంధీ ఆస్పత్రి రికార్డులకు పొంతన కుదరడంలేదని ఆరోపించారు. మధుసూదన్‌కి ఏం జరిగినా అది ప్రభుత్వ హత్యేనని అన్నారు.
కరోనా విషయంలో ప్రభుత్వ నివేదికలు, వాదనలు రెండింటి మధ్య తేడా ఉంది. 29న ఈశ్వరయ్య చనిపోయినట్లు గాంధీ ఆస్పత్రి నివేదికలో పేర్కొంటే... ప్రభుత్వం హెల్త్‌బులిటెన్‌లో మరణాలు లేవని తేల్చిచెప్పింది. 30న మధుసూదన్ కరోనాతో ఆస్పత్రిలో చేరారు. వెంటనే వెంటిలేటర్ మీద పెట్టేశామంటున్నారు. మే1న ఆయన భార్య అతనితో ఫోన్లో మాట్లాడింది. వెంటిలేటర్‌మీద ఉన్న వ్యక్తి ఫోన్లో ఎలా మాట్లాడారు?. అదేరోజు సాయంత్రం ఆయన చనిపోయారని చెబుతున్నారు. ఈ రోజు వరకు మరణ ధ్రువీకరణ పత్రం ఎందుకు ఇవ్వలేదు..? టెస్టులు చేస్తే బహుమతి ఇస్తారా అని ప్రశ్నిస్తున్నారు... నేనే పంపిస్తాను బహుమతి కేటీఆర్‌కు. - బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు.
ఇవీ చూడండి:గ్రేటర్లో కొత్త ప్రాంతాల్లో పెరుగుతున్న కొవిడ్ కేసులు