ప్రజాప్రతినిధిగా కాకుండా మానవతా దృక్పథంతో సమస్యలను పరిష్కరిస్తున్నామని భాజపా రాష్ట్ర ఆధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఈదులగట్టుపల్లిలో ఆయన పర్యటించారు. వరద ఉద్ధృతికి నీటిమట్టమైన ఇళ్లు, ధ్వంసమైన రహదారిని పరిశీలించారు. రహదారులపై వరద పోటెత్తడం వల్ల తలెత్తిన ఇబ్బందులు, ప్రయాణాలపై భాజపా ప్రభుత్వం దృష్టిసారిస్తుందని తెలిపారు.
'మానవతా దృక్పథంతో సమస్యల పరిష్కారానికి కృషి' - మానవతా దృక్పథంతో సమస్యల పరిష్కారానికి కృషి
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు భాజపా రాష్ట్ర ఆధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ సూచించారు. మానకొండూరు మండలం ఈదులగట్టుపల్లిలో ఆయన పర్యటించారు.
మానవతా దృక్పథంతో సమస్యల పరిష్కారానికి కృషి
గ్రామపంచాయతీ మునిగిపోయే తరహాలో వర్షం బీభత్సం సృష్టిస్తుందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి :రెడ్‌క్రాస్ వాలంటీర్లు సహాయ చర్యల్లో పాల్గొనాలి: గవర్నర్