తెలంగాణ

telangana

By

Published : Jan 5, 2021, 12:31 PM IST

ETV Bharat / state

'దళితులకు హామీలేనా.. అమలు చేయరా?'

దళితుల పట్ల ప్రభుత్వ తీరుకు నిరసనగా.. కరీంనగర్ కలెక్టరేట్​ ఎదుట భాజపా ఎస్సీ మోర్చా ధర్నా చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం దళితులకు అన్యాయం చేస్తోందంటూ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

BJP SC Morcha holds dharna in front of Karimnagar Collectorate to protest against government
'దళితులకు హామీలేనా.. అమలు చేయరా?'

ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అర్హులకు.. ఎలాంటి షరతులు లేకుండా రుణాలు మంజూరు చేయాలని డిమాండ్​ చేస్తూ భాజపా ఎస్సీ మోర్చా నాయకులు కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

తెలంగాణ ఏర్పడిన అనంతరం రాష్ట్రంలో దళితులకు అడుగడుగునా అన్యాయమే జరుగుతోందని జిల్లా దళిత మోర్చా అధ్యక్షులు వేణు పేర్కొన్నారు. తెరాస హామీలు ఇవ్వడమే తప్ప వాటిని అమలు చేయడం లేదని మండిపడ్డారు.

ప్రభుత్వం తక్షణమే స్పందించి.. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు కలెక్టర్​కు వినతి పత్రాన్ని అందజేశారు.

ఇదీ చదవండి:భాజపా ఎస్సీ మోర్చా నాయకులు ఆందోళన.. అరెస్ట్​

ABOUT THE AUTHOR

...view details