తెలంగాణ

telangana

ETV Bharat / state

డబ్బులతో గెలవాలని బీఆర్​ఎస్​, కాంగ్రెస్‌లు చూస్తున్నాయి : కిషన్​రెడ్డి - రంగారెడ్డి బీజేపీ బహిరంగసభ

BJP Public Meeting in Ranga Reddy District : బీఆర్​ఎస్​, కాంగ్రెస్ పార్టీలు ఒకే తాను ముక్కలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరంలో జరిగిన గిరిజన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన.. ఓటర్లను ఉద్దేశించి ప్రసంగించారు. ​

BJP Public Meeting
BJP Public Meeting in Ranga Reddy District

By ETV Bharat Telangana Team

Published : Nov 15, 2023, 9:18 AM IST

డబ్బులతో గెలవాలని బీఆర్​ఎస్​, కాంగ్రెస్‌లు చూస్తున్నాయి కిషన్​రెడ్డి

BJP Public Meeting in Ranga Reddy District :‍బీఆర్​ఎస్​, కాంగ్రెస్‌, మజ్లిస్‌ పార్టీల డీఎన్​ఏ ఒక్కటేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి(Kishanreddy) ఆరోపించారు. బీఆర్​ఎస్​, కాంగ్రెస్‌లు డబ్బులతో ప్రజల్ని కొనాలని చూస్తున్నాయని.. మోసపోతే నష్టపోతామని సూచించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో బీజేపీ అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్‌కు మద్దతుగా గిరిజనుల ఆత్మీయ సమ్మేళనం(BJP Atmiya Sammelanam)లో కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. కేసీఆర్​కు ఓటేస్తే ఆయన పిల్లలకు దోచిపెడుతారని.. బీజేపీకు ఓటేస్తే ప్రజల కోసం పనిచేస్తామని స్పష్టం చేశారు. మహేశ్వరంలో రెండు పడక గదుల ఇళ్లను మజ్లిస్‌ నేతల సూచనల మేరకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్థానికేతరులకు కేటాయించారని.. అధికారంలోకి రాగానే తిరిగి గిరిజనులకు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. బీఆర్​ఎస్​, కాంగ్రెస్‌లు ఒకే తాను ముక్కలని ఆయన ఆరోపించారు.

"బీఆర్​ఎస్​ పార్టీ బందిపోట్ల పార్టీ. కేసీఆర్​ కుటుంబం ఈరోజు బందిపోట్లులాగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడపడితే అక్కడ దోచుకుంటున్నారు. దోచుకున్న డబ్బు మొత్తాన్ని కక్కిస్తాం. బీఆర్​ఎస్​, మజ్లిస్​ పార్టీలు రెండూ ఒకటే. బీఆర్​ఎస్​ రాకముందు ఈ మజ్లిస్​ పార్టీని పెంచిపోశించింది కాంగ్రెస్​ పార్టీ. బీఆర్​ఎస్​ పార్టీ వాళ్లు మజ్లిస్​కు వేల కోట్ల రూపాయలను కట్టబెడుతున్నారు. ఈ మూడు పార్టీలు కూడా ఒకే తాను ముక్కలు."- కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

పేదోళ్లు ఉద్యమం చేస్తే, పెద్దోళ్లు రాజ్యం ఏలుతున్నారు: బండి సంజయ్

Bandi Sanjay Fires on CM KCR : కాంగ్రెస్ గెలవాలని ఆ పార్టీలోని 70 మంది అభ్యర్థులకు ముఖ్యమంత్రి కేసీఆర్​ డబ్బులు ఇస్తున్నారని.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ ఆరోపించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేడ్కర్ చౌరస్తాలో బీజేపీ అభ్యర్థి బొమ్మ శ్రీరామ్‌కు మద్దతుగా కార్నర్ మీటింగ్‌(BJP Meeting)లో పాల్గొన్నారు. కేటీఆర్​ను సీఎం చేస్తే బీఆర్​ఎస్​లో పదవి కోసం నేతల మధ్య కొట్లాట తప్పదని.. కాంగ్రెస్‌లో ఐతే.. గల్లీ నుంచి దిల్లీ వరకు అందరూ ముఖ్యమంత్రులేనని విమర్శించారు. కాంగ్రెస్​ పార్టీకి ఓటేస్తే వాళ్లు పోయేది మళ్లీ బీఆర్​ఎస్​లోకేనని బండి సంజయ్​ విమర్శించారు. అడుగడున కేసీఆర్​ అడ్డుకోవాలని బీజేపీ నేతలకు సూచించారు.

"కాళేశ్వరం మూడేళ్లు కూడా కాలేదు.. లక్ష కోట్లు రూపాయలు అవినీతి జరిగింది. ఇంజినీర్​ లాగా పని చేశానని కేసీఆర్​ చెప్పారు. చూశారా నా గొప్పతనమని అన్నాడు. బస్సులు కట్టి జనాలను తీసుకెళ్లారు. కానీ మూడేళ్లకే కాళేశ్వరం కతం అయిపోయింది. కొడితే ఏనుగు కుంభస్థలమే కొట్టాలి. కేసీఆర్​ను ఎదుర్కొనే మొనగాడు హుజూరాబాద్​ బిడ్డ ఈటల రాజేందర్​నే అని చెబుతున్నా."- ఈటల రాజేందర్​, బీజేపీ ఎమ్మెల్యే

Etela Rajender Comments on Kaleshwaram :బీఆర్​ఎస్​ ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరిట ప్రజల్ని మోసం చేస్తోందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ విమర్శించారు. కుంభస్థలాన్ని కొట్టేందుకే గజ్వేల్‌ బరిలో నిలిచినట్లు స్పష్టం చేశారు. కాళేశ్వరం కట్టి మూడేళ్లు అయినా కాలేదు అప్పుడే కుంగిపోయింది. గొప్పలు చెప్పుకోవడానికే కేసీఆర్​.. ఇంజినీర్​ వేసి.. తానే డిజైన్​ ఇచ్చాను అన్నట్లు ప్రచారం చేశారని మండిపడ్డారు.

జోరందుకున్న ఎన్నికల ప్రచారం - మాకే ఓటేసి గెలిపించాలంటూ కోరుతున్న అభ్యర్థులు

'కేసీఆర్‌కు రెండుసార్లు అవకాశమిస్తే రాష్ట్రాన్ని భిక్షమెత్తుకునేలా చేశారు'

ABOUT THE AUTHOR

...view details