భైంసాలో నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్లో భాజపా మహిళా మోర్చా ఆధ్వర్యంలో మహిళలు ఆందోళన చేపట్టారు. ఎన్టీఆర్ విగ్రహం వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ... రాస్తారోకో నిర్వహించారు. దీంతో రెండు గంటలు ట్రాఫిక్ స్తంభించింది.
'అత్యాచారాలు జరుగుతున్న ప్రభుత్వం పట్టించుకోవట్లేదు' - తెలంగాణ వార్తలు
రాష్ట్రంలో మహిళలపై, చిన్నారులపై అత్యాచారాలు జరుగుతున్న ప్రభుత్వం పట్టించుకోవట్లేదని భాజపా మహిళా మోర్చా సభ్యులు వ్యాఖ్యానించారు. భైంసా ఘటనలో నిందితులను వెంటనే అరెస్టు చేయాలని కరీంనగర్లో రాస్తారోకో నిర్వహించారు.
'అత్యాచారాలు జరుగుతున్న ప్రభుత్వం పట్టించుకోవట్లేదు'
రాష్ట్రంలో మహిళలపై, చిన్నారులపై అత్యాచారాలు జరుగుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదని భాజపా రాష్ట్ర మహిళా మోర్చా కార్యదర్శి సామ్రాజ్య లక్ష్మి వ్యాఖ్యానించారు. ఈ ఘటనలపై వెంటనే చర్యలు తీసుకోవాలని... లేకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి:అనారోగ్యంతో అర్జున అవార్డు గ్రహీత కన్నుమూత