కరీంనగర్ ఎంపీ, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ మహాశక్తి ఆలయంతో పాటు తన కార్యాయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈసారి రాష్ట్రంలో జరుపుకుంటున్న వినాయక చవితిని ప్రజలు జీవితంలో ఎన్నడూ మరిచిపోరని సంజయ్ విమర్శించారు.
ఈసారి పండుగను ప్రజలు ఎన్నటికీ మర్చిపోరు: బండి సంజయ్
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కరీంనగర్‌లోని తన కార్యాలయంలో గణేశుడికి ప్రత్యేక పూజలు చేశారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా హిందువులు పండుగ జరుపుకుంటామని కోరినా.. రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల ద్వారా అడ్డుకుంటోందని ఆరోపించారు.
కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా హిందువులు పండుగ జరుపుకుంటామని కోరినా.. రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల ద్వారా అడ్డుకుంటోందని ఆరోపించారు. ఆనాటి నిజాం సర్కార్ అరాచకాలను ప్రజలు ఇప్పటికి చెప్పుకుంటున్నారని.. ఇప్పడు ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ అరాచకాలను ప్రజలు జీవితాంతం గుర్తుంచుకుంటారని పేర్కొన్నారు. కరోనా నిబంధనలకు అనుగుణంగానే పండుగ జరుపుకుంటామని చెప్పినప్పటికీ యువకులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజలు ఈ తరహా చర్యలను అడ్డుకునే రోజులు త్వరలోనే వస్తాయని బండి సంజయ్ హెచ్చరించారు.
ఇదీ చదవండి:ఈగ ఫిక్షనల్.. ఎలుక ఒరిజినల్