మహిళా డిగ్రీ కాలేజీ వద్ద మద్యం దుకాణానికి అనుమతి ఇవ్వడంపై భాజాపా మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కరీంనగర్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని తొలగించాలంటూ... భాజపా మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు గాజుల స్వప్న ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. కళాశాల పక్కనే ఎస్సీ బాలికల వసతి గృహం ఉందని... అయినా మద్యం దుకాణానికి అనుమతిచ్చారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాలేజీ వద్ద మద్యం దుకాణం తొలగించాలంటూ రాస్తారోకో - bjp mahila morcha protest in karimnagar for they demanded to remove the wine shops beside college
ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద మద్యం షాపు తొలగించాలంటూ కరీంనగర్లో భాజపా మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.
కాలేజీ వద్ద మద్యం దుకాణం తొలగించాలంటూ రాస్తారోకో