సన్నరకం వరి ధాన్యం క్వింటాకు రూ. 2500 చెల్లించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లావ్యాప్తంగా భాజపా నాయకులు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. కరీంనగర్- జగిత్యాల, కరీంనగర్- మంచిర్యాల రహదారులపై వాహనాలు గంటసేపు స్తంభించాయి. పోలీసుల జోక్యంతో ఆందోళనను విరమించారు.
సన్నాలకు కనీస మద్దతుధర చెల్లించాలంటూ భాజపా రాస్తారోకో - కరీంనగర్లో భాజపా నాయకుల ధర్నా
కరీంనగర్ జిల్లా చొప్పదండి, రామడుగు, గంగాధర మండలాల్లో భాజపా ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. సన్నరకం వరి ధాన్యం క్వింటాకు రూ. 2500 చెల్లించాలంటూ ఆందోళన చేశారు.
సన్నాలకు కనీస మద్దతుధర చెల్లించాలంటూ భాజపా రాస్తారోకో
కరీంనగర్లో 1,21,972 ఎకరాల్లో రైతులు సన్నరకం పంట సాగు చేశారని.. కానీ అధిక వర్షాలతో దిగుబడి రాక నష్టపోయే స్థితిలో ఉన్నారని భాజపా జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి తెలిపారు. ప్రభుత్వం సన్నరకం వరిధాన్యాన్ని రైతులతో సాగు చేయించారని.. ఇప్పుడు వారికి కనీస మద్దతు ధర ప్రకటించి అన్నదాతలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండిః'సన్నరకానికి మద్ధతు ధర ఇవ్వకపోతే ఆందోళనలు ఉద్ధృతం చేస్తాం'