తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆ మూడు నెలల బిల్లు ప్రభుత్వమే చెల్లించాలి' - bjp leaders protest at karimnagr se office

లాక్‌డౌన్‌ కాలంలో అధిక కరెంట్​ బిల్లుల వసూలును నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, బొడిగె శోభ ఆధ్వర్యంలో భాజపా నేతలు కరీంనగర్‌ ఎస్‌ఈ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. బిల్లులను ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

bjp leaders protest at karimnagr se office for electricity bills in telangana
ఆ మూడు నెలల బిల్లు ప్రభుత్వమే చెల్లించాలి

By

Published : Jun 15, 2020, 11:06 PM IST

లాక్‌డౌన్ నేపథ్యంలో ఆర్థికంగా దిగజారిన ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాల్సింది పోయి.. అదనంగా బిల్లులు వసూలు చేయడం సరైన పద్దతి కాదని మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం వెంటనే ఆ బిల్లులను చెల్లించి ప్రజలు, అటు డిస్కంలపై భారం పడకుండా చూడాలన్నారు.

మాజీ ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, బొడిగె శోభ నేతృత్వంలో భాజపా నాయకులు కరీంనగర్​ ఎస్‌ఈ కార్యాలయం ముందు ధర్నా చేశారు. అనంతరం ప్రజలపై భారం కాకుండా చూడాలని ట్రాన్స్‌కో ఎస్‌ఈకు వినతిపత్రం అందజేశారు.

ఇదీ చూడండి:రాష్ట్రంలో లక్ష కల్లాల నిర్మాణం.. రూ.750 కోట్లు విడుదల

ABOUT THE AUTHOR

...view details