కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలంటూ.. భాజపా నాయకులు ఆందోళనకు దిగారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రి ఎదుట నిరసన వ్యక్తం చేశారు. లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికి కరోనా పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
'కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చండి' - కరీంనగర్లో భాజపా నాయకుల ధర్నా
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రి ఎదుట భాజపా నాయకులు ఆందోళన చేపట్టారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రవీణ్‌రెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు.
'కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చండి'
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్‌ను తెలంగాణలో అమలు చేయాలని నినాదాలు చేశారు. రాష్ట్రంలో మాస్కులు, శానిటైజర్లను పంపిణీ చేయాలని కోరారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రవీణ్‌రెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు.
ఇదీ చూడండి :ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు: లక్ష్మణ్